ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమిస్తోన్న వైఎస్సార్సీపీ

న్యూఢిల్లీః అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ ..జాతీయస్థాయిలో వైఎస్సార్సీపీ ఉద్యమిస్తోంది. సేవ్ డెమోక్రసీ నినాదంతో హస్తినలో పోరాటం కొనసాగిస్తోంది. ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నేతలు ఢిల్లీలో మంగళవారం బిజీబిజీగా గడిపారు. వరుసగా వివిధ జాతీయ పార్టీ నాయకులను, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను  కలిసి చంద్రబాబు అవినీతిపై రూపొందించిన చంద్రబాబు ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తక కాపీని అందించారు. బాబు అనైతిక కార్యకలాపాల గురించి వివరించారు. ఇవాళ రాష్ట్రపతి, ప్రధానిలను కలిసే అవకాశం ఉంది.

Back to Top