ఉక్కు పోరాటంవైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మరో పోరాటానికి శ్రీకారం చుట్టింది. వైయస్‌ఆర్‌ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండు చేస్తూ ఉక్కు పోరాటం చేస్తోంది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం నిరాకరించడంతో వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.  కడప నగరంలోని అంబేద్కర్‌ కూడలి వద్ద వైయస్‌ఆర్‌సీపీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసిన వైయస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, మేయర్‌ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి, నాయకులు సునీల్‌కుమార్,  మాజీ ఎమ్మెల్సీ పి.సుబ్బారెడ్డి , నగర అధ్యక్షులు,  సీనియర్ నాయకులు నిత్యానంద రెడ్డి,  కడప జిల్లా పార్లమెంటరీ సోషల్ మీడియా కో -ఆర్డినేటర్  తెలుగుపులి.దుర్గ ప్రసాద్, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు సంబటురు ప్రసాద్ రెడ్డి , కడప జిల్లా, నగర మహిళఅధ్యక్షులురాలు పత్తి రాజేశ్వరి, తెలుగుపులి వెంకటసుబ్బమ్మ, కడప జిల్లా నగర యువజన విభాగ అధ్యక్షుడు చల్లా  రాజా శేఖర్,  దేవిరెడ్డి ఆదిత్య, బంగారునాగయ్య ,చిన్నాబాబు, అల్లూరు ఖాజా,  మహమ్మద్ యాసీన్, జాస్వ, కరిముల్లా, షఫీ  తదితరులు పాల్గొన్నారు.
Back to Top