యూరేనియం ప్లాంట్‌పై పోరాటం ఉధృతం


– రైతుల ధర్నాకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు
– ధర్నాలో కూర్చున్న వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి
 వైయస్‌ఆర్‌ జిల్లా: యురేనియం ప్లాంట్‌ కోసం పోరాటం ఉధృతమైంది. ఇవాళ తుమ్మలపల్లి యురేనియం ప్లాంట్‌ వద్ద వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి పాల్గొని ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వైయస్‌ఆర్‌ జిల్లాలోని యూరేనియం ప్లాంట్‌ పరిధిలోని రైతులు తమ సమస్యలను ఫిబ్రవరి 4వ తేదీ మా దృష్టికి తెచ్చరన్నారు. యూసీఐఎల్‌లోని ట్రైడెంట్‌ పాండ్‌లోని నీళ్లు భూమిలోకి ఇంకి, ఆ నీరు మళ్లీ బోర్ల ద్వారా రావడం వల్ల రైతులకు సంబంధించిన పంటలు దెబ్బతింటున్నాయన్నారు. స్థానికులకు తీవ్రమైన చర్మవాధ్యలు ప్రభలుతున్నాయన్నారు. జాయింట్‌ పెయిన్స్, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. గాలి, నీరు, భూమి అన్నీ కూడా కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 21వ తేదీన సీఎండీని పిలిపించి ఈ గ్రామాల్లోని సంఘటనలు చూపించామన్నారు. ఇప్పటి వరకు జరిగిన పంట నష్టం పరిహారం ఇవ్వాలని సీఎండీకి వినతిపత్రం అందజేశారన్నారు. గ్రామాలకు వచ్చే నీళ్లను పార్నపల్లె పైప్‌లైన్‌కు అనుసంధానం చేయాలని స్థానికులు సీఎండీని కోరారని చెప్పారు. టైలెండ్‌ పాండ్‌ను పున ర్‌ నిర్మించాలని కోరామన్నారు. స్థానికంగా ఉన్న ఇల్లు, పొలాలు గ్రామస్తుల సమ్మత్తంతో తరలించాలని కోరామన్నారు. ఈ సమయంలో సీఎండీ రెండు వారాలు గడువు కోరి  ఇంతవరకు స్పందించలేదన్నారు. సత్వరమే ప్రభుత్వం స్పందించాలని అవినాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.
 
Back to Top