చంద్రబాబు రైతులను విస్మరించారు


హైదరాబాద్‌:  చంద్రబాబు రైతులను విస్మరించారని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌నాగిరెడ్డి విమర్శించారు. ఏపీలో కరువు విలయతాండం చేస్తోందని, ప్రజలు పనులు లేక వలసలు వెళ్తున్నారని ఆందోళన  వ్యక్తం చేశారు. రాయలసీమను కరువు జిల్లాలుగా ప్రకటించాలని అధికారులు చెబుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. చంద్రబాబు పెట్టుబడుల పేరుతో విదేశాలకు ప్రత్యేక విమానాల్లో వెళ్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారే తప్ప రైతులను ఆదుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా చంద్రబాబు అమలు చేయలేదని మండిపడ్డారు.
 
Back to Top