హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చైనా పర్యటనపై పలు అనుమానాలు ఉన్నాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు పలు సూచనలు చేశారు. 'చంద్రబాబు గారూ చైనా, సింగపూర్, స్విట్జర్లాండ్ వెళ్లండి. కానీ, ఆఫ్ఘనిస్తాన్ వెళ్లకండి. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఆఫ్ఘాన్లా మారుతుంది' అని ఎద్దేవా చేశారు.<br/>ఏపీలో దోచుకున్న సొమ్మును దాచుకునేందుకే చంద్రబాబు నాయుడు చైనా, సింగపూర్, స్విట్జర్లాండ్ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని నడిరోడ్డులో అమ్మకానికి పెట్టిన ఘనత టీడీపీ సర్కారుదేనని కొయ్య ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు తనయుడు నారాలోకేశ్, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కొన్ని కోట్లు దోచుకున్నారని ఆయన అన్నారు.