5, 6 తేదీల్లో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మంపై స‌మీక్ష‌లు

హైద‌రాబాద్‌:  ఈ నెల 5, 6వ తేదీల్లో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మంపై స‌మీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. హైద‌రాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మావేశాలు జ‌రుగ‌నున్నాయి. ఈ నెల 5వ తేదీ విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం, ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌పై స‌మీక్షిస్తారు. 6వ తేదీ కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, క‌ర్నూలు, వైయ‌స్ఆర్ జిల్లా, అనంత‌పురం జిల్లాల స‌మీక్షా స‌మావేశాలు ఉంటాయి. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని జూలై 8వ తేదీ నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్ట‌గా..  నిర్విరామంగా సాగుతోంది. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ నాయ‌కులు ఇంటింటా ప‌ర్య‌టించి ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డంతో పాటు, వైయ‌స్ఆర్‌సీపీ పోరాటాల‌ను వివ‌రిస్తున్నారు. చంద్ర‌బాబు పాల‌న‌పై మార్కులు వేయిస్తూ ప్ర‌జా బ్యాలెట్ పంపిణీ చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మంపై ఇప్ప‌టికే పార్టీ అధినేత ప‌లుమార్లు నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు, ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 5,6వ తేదీల్లో జ‌రిగే స‌మావేశాల్లో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మంపై స‌మీక్షించి పార్టీ అధినేత స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌నున్నారు.

Back to Top