వెలిగొండ ప్రాజెక్టు ప్రకాశం జిల్లా హక్కు

–ప్రభుత్వం నిద్రపోతుందా..?
–ప్రకాశం జిల్లాకు టీడీపీ తీవ్ర అన్యాయం
–వెలిగొండ ప్రాజెక్టు పూర్తయ్యే వరుకూ మా పోరాటం ఆగదు..

టీడీపీ ప్రభుత్వం ప్రకాశం జిల్లా ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ నేత మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.  వెలిగొండ ప్రాజెక్టు సాధన కోసం ఆయన చేపట్టిన పాదయాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. పేరుకు ప్రకాశం జిల్లానే కాని ప్రకాశం జిల్లా ప్రజల్లో వెలుగులేదని ఆవేదన వ్యక్తం చేశారు.  జిల్లా అభివృద్ధిలో వెనుకబడిందన్నారు.  జిల్లాలో 33 లక్షలు ప్రజలు, సుమారు 11 లక్షల 28 వేల ఎకరాల సాగుభూమి, . ఆరులక్షల 80వేల రైతులు , 13 లక్షల మంది యువత,. 3 లక్షల మంది పట్టభ్రదులు ఉన్నా జిల్లా అభివృద్ధికి నోచుకోలేదన్నారు.  

జిల్లాలో 70 శాతం మందికి తాగునీరు కూడా అందడంలేదంటే టీడీపీ ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శమన్నారు. జిల్లాలో  50 శాతం భూములు నీరులేక సాగుజరగక ఎండిపోతున్నాయన్నారు. ప్రకాశం జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన వ్యక్తి దివంగత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని, ఆయన 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత  ప్రకాశం జిల్లాలో  అన్నివిధాల అభివృద్ధి జరగాలంటే ప్రకాశం పశ్చిమ ప్రాంతంలో ఎక్కడా సాగునీటికి, మంచినీటికి లోటులేకుండా ఉండాలని వెలిగొండ ప్రాజెక్టు పనులు ప్రారంభించడమే కాక సుమారు రూ. 3వేల 500 కోట్లు ఖర్చుపెట్టి 70 శాతం పనలు పూర్తిచేసిన ఘనత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ప్రకాశం జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. గత నాలుగేళ్ల నుంచి కరువు తీవ్రస్థాయిలో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. నిద్రపోతున్నా  ప్రభుత్వానికి మేల్కొలపడానికే పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు.

పశ్చిమ ప్రాంతంలో పాదయాత్రకు ఎక్కడకు వెళ్ళిన అవ్వలు మాత్రమే కనిపిస్తున్నారని, యువత ఎవరూ కనబడటం లేదన్నారు. నాలుగు సంవత్సరాలగా కరువు విలయతాండవం చేయడంతో బతుకుదెరువు కోసం యువత వలసవెళ్ళిపోయిన పరిస్థితి కనబడిందన్నారు. భూములన్నీ బీడులుగా మారిపోయాయని రైతులు వాపోతున్నారన్నారు. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అ«ధికారంలోకి రాక ముందు వెలిగొండ ప్రాజెక్టు ఒక ఏడాదిలో నిర్మించి ఇస్తామని చంద్రబాబు హమీ ఇచ్చారన్నారు. నాలుగు సంవత్సరాలైన వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం జరగలేదని దుయ్యబట్టారు.

చంద్రబాబు, ఆయన మంత్రులు జిల్లాకు వచ్చి ప్రాజెక్టు సంకాంత్రి తర్వాత నిర్మిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. సంక్రాంతి  తర్వాత ప్రాజెక్టు నిర్మిస్తామని చంద్రబాబు ఎందుకు చెప్పుతున్నారంటే సంక్రాంతి తర్వాత తమను చంద్రబాబును ఇంటికి పంపిస్తారన్నారు. జిల్లాలో సమస్యలు పరిష్కారానికి ఒక్కటే మార్గమని తక్షణమే వెలిగొండ ప్రాజెక్టు నిర్మించుకోవాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయ్యే వరుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పోరాటం ఆగదని, ప్రాజెక్టు పూర్తిచేయకపోతే  రాబోయే వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో సంవత్సరంలోనే పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. 
Back to Top