దుర్గారావు మృతితోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి


పశ్చిమ గోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త దుర్గారావు మృతితోనైనా చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వం కళ్లు తెరవాలని తాజా, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణాపురం గ్రామానికి చెందిన దుర్గారావు బంద్‌లో పాల్గొనగా, పోలీసులు అరెస్టు చేయడంతో  గుండెపోటుతో మృతి చెందారు.  ఆయన మృతి పట్ల వైవీ సుబ్బారెడ్డి సంతాపం తెలిపారు. ఈ మేరకు దుర్గారావు కుటుంబ సభ్యులకు వైయస్‌ జగన్‌ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబానికి తక్షణమే కొంత మేర ఆర్థికసాయం చేశామని, ఆ కుటుంబానికి వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం యూటర్న్‌ తీసుకొని డ్రామాలాడుతున్నారన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చారని, ఉద్యమాన్ని అణగద్రొక్కాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎందుకు అరెస్టు చేశారని ఆయన నిలదీశారు. అరెస్టులు, తోపులాటల కారణంగా దుర్గారావు గుండె ఆగిపోయిందన్నారు. ఎందుకు ద్వంధ ప్రమానాలు పాటిస్తారని నిలదీశారు. మా పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్దితో పోరాటం చేస్తున్నారని చెప్పారు. హోదా కోసం రాజీనామాలు చేశామన్నారు. చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలు పార్లమెంట్‌లో అందరూ  చూశారన్నారు. చంద్రబాబు ఆడుతున్న డ్రామాలు, కేంద్రం చేస్తున్న మోసాలకు నిరసనగా ఇవాళ బంద్‌ చేపట్టామన్నారు. స్వచ్ఛందంగా బంద్‌లు చేపడితుంటే ఎక్కడిక్కడ అరెస్టులు చేయడం వల్లే ఇలాంటి అఘాయిత్యాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు చేయలేని పని, ప్రజలు రోడ్లపైకి వచ్చి చేస్తుంటే ఇలాంటి చర్యలకు పాల్పడటం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరవాలని సూచించారు. 
 
Back to Top