బీజేపీ-టీడీపీ లోపాయికారి ఒప్పందం

 న్యూఢిల్లీ: ప్రజలను తప్పుదోవ పట్టించడానికే టీపీడీ అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తెచ్చిందని మాజీ ఎంపీ, వైయ‌స్ఆర్‌ సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ-టీడీపీలు ఇంకా లోపాయికారిగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ‘బీజేపీ, టీడీపీ తీరు హాస్యాస్పదంగా ఉంది.కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలిగినప్పటికీ సొంత ప్రయోజనాల కోసం లోపాయికారీగా సంబంధాలు కొనసాగిస్తోంది.ఎన్‌డీఏ సర్కారుతో నాలుగేళ్లు అంటకాగి, కేంద్రంలో అధికారం అనుభవించి, ఎన్‌డీఏ నిర్ణయాలన్నింటినీ సమర్థించి, ఇప్పుడు అవిశ్వాస తీర్మానం అంటే ప్రజలు ఎలా న‌మ్ముతార‌ని ప్ర‌శ్నించారు.  ప్రజలను మరోసారి మోసం చేసుందుకు కుట్ర చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానం.. అంతా ఓ డ్రామా!. ప్రజలు వాళ్లకి సరైన బుద్ధి చెప్తారు’ అని సుబ్బారెడ్డి హెచ్చ‌రించారు. 
Back to Top