టీడీపీ అవిశ్వాసం ఓ డ్రామా


– బీజేపీ, టీడీపీలు మళ్లీ ఐదు కోట్ల ప్రజలను మోసం చేస్తున్నాయి
– ఇన్నాళ్లూ మోదీని ఎందుకు నిలదీయలేదు
 
న్యూఢిల్లీ: బీజేపీ, టీడీపీలు మళ్లీ ఐదు కోట్ల ప్రజలను మోసం చేస్తున్నాయని, టీడీపీ అవిశ్వాస తీర్మానం ఓ డ్రామా అని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి  మండిపడ్డారు. న్యూఢిల్లీలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. మొన్నటి వరకు ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఇటీవల బయటకు వచ్చి అవిశ్వాసం పెడుతున్నారన్నారు. నాలుగేళ్లు కేంద్రంతో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఏం సాధించారని ప్రశ్నించారు. కేబినెట్‌ సమావేశాల్లో ఒక్క సారి కూడా న రేంద్రమోడీని ఎందుకు నిలదీయలేదని అన్నారు. మీరు భాగస్వామి పార్టీపై అవిశ్వాస తీర్మానం పెట్టడం ఓ డ్రామా అన్నారు. ఆ రోజు ప్రత్యేక హోదా వద్దు..ప్యాకేజీ ముద్దు అంటూ కేంద్ర మంత్రులను సన్మానించిందన్నారు. అలాంటి పార్టీ ఇవాళ అవిశ్వాస తీర్మానం పెట్టడంతో చిత్తశుద్ది లేదన్నారు. మేం 13 సార్లు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టామని, అప్పట్లో చర్చకు అనుమతించలేదన్నారు. ఇవాళ మిత్రపక్షమైన టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడితే  అనుమతించారని, ఇందులో లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. ఇద్దరూ కలిసి ఐదు కోట్ల ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. లోక్‌సభలో టీడీపీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఆ రోజు ప్రత్యేక హోదా వద్దు అన్న టీడీపీ రేపు అవిశ్వాస తీర్మానంలో సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. విభజన చట్టంలోని అంశాలను సాధించడంలో, ప్రత్యేక హోదా సాధించే విషయంలో మేం రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. ఆ రోజు మా గొంతు నొక్కిన కేంద్రం ప్రభుత్వం ఇవాళ టీడీపీ అవిశ్వాస తీర్మానం అనుమతించారన్నారు. 
 
Back to Top