నాలుగేళ్ల నుంచి మైనారీటీలు గుర్తుకురాలేదా బాబూ?

వైయ‌స్ఆర్ జిల్లా:  నాలుగేళ్ల నుంచి చంద్ర‌బాబుకు మైనారిటీలు గుర్తుకు రాలేద‌ని, ఎన్నికలు సమీపించే సరికి మైనారీటిలపై ఆయ‌నకు ఎనలేని ప్రేమ పుట్టుకు వస్తుందని వైయ‌స్ఆర్‌సీపీ తాజా, మాజీ ఎంపీ అవినాష్‌ రెడ్డి, ఎమ్మెల్యే అంజాద్‌బాషా,  మేయర్‌ సురేష్‌బాబులు విమర్శించారు. నాలుగేళ్ల నుంచి బాబుకు మైనార్టీలు గుర్తుకురాలేదా? అంటూ  ప్రశ్నించారు. మైనార్టీ మ్రంతి లేని కేబినెట్‌లో ఏపీలో మాత్రమే ఉందని, ఎన్నికలు వస్తుండటంతో మైనార్టీలప పట్ల కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు.  మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైయస్‌ఆర్‌కే దక్కుతుందని,  ముస్లింలను మభ్యపెట్టేందుకు నారా హమారా..టీడీపీ హమారా కార్యక్రమం అన్నారు. చంద్రబాబు లాలూచీ రాజకీయాలు వైయస్‌ఆర్‌సీపీకి చేతకాదన్నారు. 
Back to Top