ఢిల్లీలో టీడీపీ ఎంపీల డ్రామాలు మొదలు


అనంతపురం: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో ఢిల్లీలో టీడీపీ ఎంపీలు తమ డ్రామాలను మొదలుపెట్టారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. వైయస్‌ జగన్‌ వల్లే హోదా అంశం సజీవంగా ఉందని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారన్నారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆమరణ దీక్ష చేశారని గుర్తు చేశారు. బీజేసీతో నాలుగేళ్లు అంటకాగి ఇప్పుడు చంద్రబాబు డ్రామాలాడుతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు ఎన్నికల భయం పట్టుకుందని ఆయన విమర్శించారు. 
 
Back to Top