వైయస్‌ఆర్‌ జిల్లాపై బాబు వివక్ష

వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌ కడప జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబు వివక్ష చూపుతున్నారని ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి మండ్డిపడ్డారు. సోమవారం రాజంపేటలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును తప్పుపట్టారు. నాలుగేళ్ల తరువాత టీడీపీ నేతలకు ఉక్కు పరిశ్రమ గుర్తొచ్చిందని ధ్వజమెత్తారు. వైయస్‌ హయాంలో ఉన్న అనుకూలత ఇప్పుడు ఎందుకు లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు మరో పదేళ్లు అవకాశం  ఇచ్చినా అభివృద్ధి జరగదని విమర్శించారు. ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ నేతలు దొంగ దీక్షలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి వంగి వంగి దండాలు పెట్టేవారా దీక్షలు చేసేది అని ప్రశ్నించారు. సీఎం ఇంటి ఎదుట లేదంటే ఢిల్లీలో దీక్ష చేయాలని..మేం కూడా మద్దతిస్తామని చెప్పారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తుందని, మాతో కలిసి రావాలంటే టీడీపీ ఎంపీలు ఎదురుదాడి చేశారని చెప్పారు. టీడీపీ ఎంపీలు ఒక్క రోజు కూడా పదవి వదులుకునేందుకు సిద్ధంగా లేరన్నారు. వైయస్‌ జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
Back to Top