పాదయాత్ర ప్రజలకు భరోసానిచ్చింది

విజయనగరం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మంచిరోజులు వస్తున్నాయనే భరోసాను ప్రజలకు కల్పించిందని పార్టీ మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే కాదు.. వైయస్‌ జగన్‌పై ఉన్న నమ్మకంతో ప్రజా సంకల్ప పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుందన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెంలో పాదయాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా మిథున్‌రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. దేశపాత్రునిపాలెం వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ మాట ఇస్తే తప్పడనే విశ్వాసం ప్రజల్లో బలంగా నాటుకుపోయిందన్నారు. జననేత ఏ మాట చెప్పినా ఆ మాటకు కట్టుబడి ఉంటారు. అదే ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది. రాబోయే రోజుల్లో మంచి పరిపాలన వస్తుందని, రైతులు, మహిళలు, విద్యార్థుల్లో భరోసా ఇచ్చిందన్నారు. వైయస్‌ జగన్‌ ప్రకటించిన ప్రతీ పథకం చిత్తశుద్ధితో అమలు చేస్తారన్నారు. 
Back to Top