చిత్తూరు జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ సంఘీభావ పాదయాత్ర

చిత్తూరుః వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర 3వేల కిలోమిటర్ల పూర్తిచేసుకోనున్న సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. కలకడ మండల గోపాలపురం నుంచి బాలయ్యగారి పల్లి వరుకు పాదయాత్ర సాగింది. మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. మదనపల్లిలో ఒకటో వార్డు అమ్మచెరువు మిట్ల, చంద్రకాలనీలో  ఎమ్మెల్యే దేశాయ్‌ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్‌ కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వైయస్‌ఆర్‌సీపీ నవరత్నాలను ప్రచారం చేశారు.
 


Back to Top