ప్ర‌జల ఆకాంక్ష నెర‌వేరే వ‌ర‌కు వైయ‌స్ జ‌గ‌న్ పోరాటం

చిత్తూరు: ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా సాధనకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోరాటం చేస్తార‌ని ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసిన  వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. లోక్‌స‌భ స్పీకర్ సుమిత్రా మహాజ‌న్ వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించిన తర్వాత మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..విభ‌జ‌న చ‌ట్టంలోని ప్ర‌ధాన హామీ అయిన ప్ర‌త్యేక హోదాను ఏపీకి ఇవ్వ‌కుండా బీజేపీ ద‌గా చేసింద‌ని, నాలుగేళ్లు కేంద్రంతో క‌లిసి ఉన్న టీడీపీ హోదాపై నోరెత్త‌కుండా మోసం చేసింద‌ని మండిప‌డ్డారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల తీరుతో ఏపీ ప్ర‌జ‌లు నిరాశ చెందారని తెలిపారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరే వరకు వైయ‌స్‌ జగన్ పోరాటం చేస్తార‌న్నారు.  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల హితం కోరి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ప్రత్యేక హోదా సాధ‌న‌కు పోరాటం చేస్తున్న‌ట్లు చెప్పారు.  పార్ల‌మెంట్లో హోదా డిమాండ్‌ను గట్టిగా వినిపించామ‌న్నారు. నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టామ‌ని, పార్లమెంట్‌ సమావేశాలను స్తంభింపజేశామ‌న్నారు. తమ అధినేత వైయ‌స్‌ జగన్‌ రాసిన లేఖను పార్లమెంట్‌లోని ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలకు అందజేసి, వారి మద్దతు కూడగట్టామ‌న్నారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయకత్వంలో మాత్రమే ప్రత్యేక హోదా వ‌స్తుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.


Back to Top