వచ్చే ఎన్నికల్లో బాబుకు ఓటుతో బుద్ధి చెప్పాలి


– కుమారుడు..మనవడిని ముఖ్యమంత్రి చేయాలన్నదే బాబు ఆలోచన 
– ఏపీ భవిష్యత్తు కోసం వైయస్‌ఆర్‌సీపీని గెలిపించాలి
–  తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
ప్రకాశం: వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్పాలని తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం వైయస్‌ఆర్‌సీపీని గెలిపించాలని ఆయన విజ్ఞాప్తి చేశారు.  వైవీ సుబ్బారెడ్డి ప్రజా చైతన్య పాదయాత్ర ముగింపు సందర్భంగా వెలుగొండ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. 
వైవీ సుబ్బారెడ్డి దాదాపు 207 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, మొద్దు నిద్ర పోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకు ఆయన చేసిన ప్రయత్నం అభినందనీయమన్నారు. మెట్ట ప్రాంతాలకు నీరు ఇచ్చే వెలుగొండ ప్రాజెక్టును త్వరిగతిన పూర్తి చేయాలని పాదయాత్ర చేయడం గొప్పవిషయమన్నారు. మూడు జిల్లాల మెట్ట ప్రాంత రైతులకు వెలుగొండ ప్రాజెక్టు ఎన్నో ఏళ్ల నాటి కల అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారన్నారు. చంద్రబాబు ఈ ప్రాజెక్టు సాంకేతికంగా పూర్తి కాదని చేతులు ఎత్తేశారని, అలాంటి పరిస్థితితో అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేస్తూ పనులు చేపట్టారన్నారు. వైయస్‌ఆర్‌ బతికి ఉంటే ఈపాటికి నీరు వచ్చేదన్నారు. 

తెలుగు ప్రజల దురదృష్టమే వైయస్‌ఆర్‌ మరణమన్నారు. వైయస్‌ఆర్‌ 86 ప్రాజెక్టులు చేపట్టారన్నారు. పోలవరం ప్రాజెక్టు ఒక బహుళార్ధసాధక ప్రాజెక్టు అని, ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని, ఇది జీవనాడీ లాంటి ప్రాజెక్టు అన్నారు. ఆ ప్రాజెక్టుకు కూడా వైయస్‌ఆర్‌ శ్రీకారం చుట్టారన్నారు. పులిచింతల ప్రాజెక్టు చేపట్టింది కూడా మహానేతనే అని గుర్తు చేశారు. కృష్ణా డెల్టాకు నీరిచేందుకు వైయస్‌ఆర్‌  విశేష కృషి చేశారన్నారు. 45 టీఎంసీలు నిలుపుకునే వెలుగొండ ప్రాజెక్టును ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. చంద్రబాబు పరిపాలకుడు కాదని, ఆయన మోసకారి అని విమర్శించారు. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్‌టీఆర్‌కు వెన్నుపొటు పొడిచిన నయవంచకుడు చంద్రబాబు అన్నారు. 

మామను క్షోభపెట్టి చంపిన చంద్రబాబుకు ప్రజలు ఓ లెక్కా అని తెలిపారు. చంద్రబాబు ధ్యేయమంతా తన కుమారుడు ఎలా ముఖ్యమంత్రిని చేయాలని, అవసరమైతే మనవడిని కూడా ఎప్పుడు ముఖ్యమంత్రిని చేయాలని కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. చంద్రబాబు రాసిన లేఖతోనే రాష్ట్ర విభజన జరిగిందన్నారు. ఒక్కసారి ఆలోచించాలని, ఇకపై పొరపాటున కూడా చంద్రబాబుకు ఓట్లు వేయకూడదన్నారు. వచ్చే ఎన్నికలు చాలా ప్రాముఖ్యమైన ఎన్నికలన్నారు. మనందరి కోసం, ప్రజాస్వామ్య మనుగడ కోసం వైయస్‌ జగన్‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉందన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయిన వెంటనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తారని చెప్పారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టును ఆయన కుమారుడు వైయస్‌ జగన్‌ పూర్తి చేసి ప్రారంభిస్తారన్నారు. 
 
Back to Top