వైయ‌స్ఆర్‌సీపీనే మొద‌ట అవిశ్వాస తీర్మానం పెట్టింది

ఢిల్లీ: ఏపీకి  ప్ర‌త్యేక హోదా , విభ‌జ‌న హామీల‌ను కేంద్రం  అమ‌లు చేయాల‌ని డిమాండు చేస్తూ ఎన్‌డీఏ ప్ర‌భుత్వంపై మొద‌ట అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టింది వైయస్ఆర్‌సీపీనే అని మాజీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి పేర్కొన్నారు. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన ఐదుగురు లోక్‌స‌భ స‌భ్యులం త‌మ‌ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశామ‌ని చెప్పారు. ఆ త‌రువాత ఢిల్లీ వేదిక‌గా ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌లు కూడా చేప‌ట్టామ‌ని చెప్పారు.  కేంద్రంపై మేం అవిశ్వాస తీర్మానం పెడితే మొద‌ట చంద్ర‌బాబు అవ‌హేళ‌న చేశార‌న్నారు. మేం లోక్‌స‌భ‌లో 13 సార్లు అవిశ్వాస  తీర్మానాల నోటీసులు ఇచ్చామ‌ని పేర్కొన్నారు.. కానీ ఆ నోటీసుల‌ను లోక్‌స‌భ  స్పీక‌రు  అనుమ‌తించ లేద‌ని అన్నారు. అయిన‌ప్ప‌టికీ వైయ‌స్ఆర్‌సీపీ  ఏపీకి హోదా కోసం త‌న పోరాటాన్ని కొన‌సాగిస్తూ వ‌చ్చింద‌న్నారు. హోదాను తీవ్రంగా వ్య‌తిరేకించిన  చంద్ర‌బాబు నాట‌కాలాడుతున్నార‌ని మండిప‌డ్డారు. ప్ర‌జాభిప్రాయం చూసి జ‌డిసి చంద్ర‌బాబు  యూటర్న్ తీసుకున్నార‌ని అన్నారు. హోదా కావాల‌ని ఇపుడు నాట‌కీయంగా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చార‌ని పేర్కొన్నారు. చంద్ర‌బాబు ప్ర‌జా సంక్షేమానికి పాటు ప‌డే వ్య‌క్తి కాద‌ని, నిరంత‌రం అధికార, రాజ‌కీయ ల‌బ్ధి కోసం ప్ర‌య‌త్నిస్తార‌ని అన్నారు. ఢిల్లీ వెళ్ళిన  ప్ర‌తి సారీ ప్ర‌జా స‌మ్య‌లు ప్ర‌స్తావించ‌కుండా ప్ర‌తిప‌క్ష నేత‌  కేసుల గురించే ఆయ‌న కేంద్రంతో  ప్ర‌స్తావించే వాడ‌ని ఢిల్లీ జ‌ర్న‌లిస్టు ఒక‌రు చెప్పార‌ని మేక‌పాటి తెలిపారు.  

తాజా ఫోటోలు

Back to Top