చంద్రబాబు పేరు వంచన..మోసం


వైయస్‌ఆర్‌ జిల్లా: చంద్రబాబు పేరు చెబితే వంచన, మోసం గుర్తుకు వస్తాయని వైయస్‌ఆర్‌సీపీ తాజా మాజీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి విమర్శించారు. శనివారం వైయస్‌ఆర్‌ జిల్లా వేంపల్లి మండల బూత్‌ కమిటీ విస్తృత స్థాయి సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, వైయస్‌ వివేకానందరెడ్డి, మేయర్‌ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఎల్లో మీడియా వైయస్‌ఆర్‌సీపీపై దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ అంటేనే సంక్షేమ పథకాలు గుర్తుకొస్తాయని, చంద్రబాబు పేరు చెబితేనే వంచన, మోసం అని విమర్శించారు. చంద్రబాబు డబ్బా కొట్టుకోవడం తప్పా చేసిందేమీ లేదని మండిపడ్డారు. బూత్‌ కమిటీ సభ్యులు, కన్వీనర్లు పోలింగ్‌ బూత్‌లపై దృష్టి పెట్టాలని సూచించారు. 
 
Back to Top