పందికొక్కుల్లా తిన్నారా..? లేదా..? బాబూ

ఉరవకొండ: చంద్రబాబూ.. మూడు కిలోమీటర్ల అయినా హంద్రీనీవా ప్రాజెక్టుకు కాలువలు తవ్వించలేని నువ్వు హంద్రీనీవా మేం తెచ్చామని చెప్పుకోవ‌డానికి సిగ్గులేదా అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ వై.శివ‌రామిరెడ్డి అన్నారు. 45 టీఎంసీలు ఉన్న హంద్రీనీవాను కేవలం 5 టీఎంసీలకు తగ్గించిన ఘనత నీది కాదా అని బాబును ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఏ ఒక్క కార్యక్రమైనా చేశారా.. పందికొక్కుల్లా దోచుకొని తిన‌డం త‌ప్పితే అని నిల‌దీశారు.  ఆడపిల్లను ఇంటికి తీసుకురావాలన్నా పేద, మధ్య తరగతి ప్రజలు భయపడే స్థితి చంద్రబాబు హయాంలో ఏర్పడింద‌న్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో రామరాజ్యం ఎలా ఉంటుందో తెలీదు కానీ, అలాంటి పాలన చూపించార‌న్నారు. పేద వారికి లక్షలాది ఇళ్లు ఇచ్చిన ఘనత వైయస్‌ఆర్‌ది అని అన్నారు. బాబు అధికారంలోకి వ‌చ్చి మూడు సంవత్సరాలు గ‌డుస్తున్నా ఒక్క ఇళ్లు అయినా కట్టించారా చంద్రబాబు అని నిలదీశారు. అమరావతి జపం చేస్తూ అక్కడి రైతాంగాన్ని రోడ్డున పడేశారని మండిపడ్డారు.

Back to Top