శ‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మం వ‌ద్ద‌ హోదా నినాదంగుజ‌రాత్‌: ప్రత్యేక హోదా కోసం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల పోరు రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్లుగా రాజీలేని పోరాటం చేస్తున్నారు. పార్టీ శ్రేణులన్నీ కంకణబద్ధులై ఆందోళనలో పాల్గొంటున్నాయి. ఏప్రిల్ 6న వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు త‌మ ప‌ధ‌వులుకు రాజీనామాలు చేసి ఢిల్లీలో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌లు చేశారు. వారికి మ‌ద్ద‌తుగా రాష్ట్ర‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు, జాతిపిత మ‌హాత్మా గాంధీజీ జ‌న్మ‌స్థ‌ల‌మైన గుజ‌రాత్ రాష్ట్రంలోని శ‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మం ముందు వైయ‌స్ఆర్‌సీపీ డాక్ట‌ర్ విభాగం అధ్య‌క్షుడు డాక్ట‌ర్ శివ‌భ‌ర‌త్ రెడ్డి, తెలుగు రాష్ట్రాలు ప్ర‌జ‌లు శాంతియుత ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చేలా ఈ పాల‌కుల‌కు మంచి బుద్ధి ప్ర‌సాదించాల‌ని ప్రార్థించారు. ఈ సంర‌ద్భంగా శివ‌భ‌ర‌త్‌రెడ్డి మాట్లాడుతూ..ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం అందరూ పోరాడదామని కోరారు.  స్వార్థ రాజకీయాలు చేసే సీఎం చంద్రబాబు ఏనాడు హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేదన్నారు. అధికారం కోసం బీజేపీతో అంటకాగి, ఉద్యమం ఉద్ధృతమైన సమయంలో మళ్లీ డ్రామాలు మొదలుపెట్టారన్నారు. అయినా చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రత్యేకహోదాతోనే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. అన్నివర్గాలు పోరాడితే కేంద్రం దిగివస్తుందన్నారు.  
Back to Top