వైయ‌స్ జగన్‌తోనే ప్రత్యేక హోదా సాధ్యంతూర్పుగోదావ‌రి: రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి సాధ్య‌మ‌ని, పార్ల‌మెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని కేంద్ర ప్ర‌భుత్వం  విస్మ‌రించిద‌ని  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ యనమదల మురళీకృష్ణ అన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ పోరాటాల‌తోనే ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌స్తుంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. కాజులూరు మండలం టి. మామిడాడ పంచాయితీ కార్యాలయం వద్ద సర్పంచ్ ఎల్లబోయిన పోతురాజు ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య‌శిబిరంలో ఆయ‌న మాట్లాడుతూ 2014 నుంచి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి   ప్రత్యేక హోదా కోసం అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నార‌ని చెప్పారు. హోదా సాధ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి ఢిల్లీలో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేప‌ట్టి హోదా నినాదాన్ని దేశ‌వ్యాప్తంగా వినిపించార‌న్నారు.  ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంద‌న్నారు. కృష్ణా జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ఊహించ‌ని విధంగా జ‌నం త‌ర‌లిరావ‌డంతో కృష్ణ‌మ్మ వార‌ధి కిక్కిరిసిపోయింద‌న్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఇదే స్పంద‌న ల‌భిస్తుంద‌న్నారు. 2019లో వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.  కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు, మాజీ సర్పంచ్ నురుకుర్తి శ్రీనివాస రావు, నాయకులు అనుసూరి శివరామకృష్ణ, ఉందుర్తి నాగేశ్వరరావు, కాకి నాగేశ్వరరావు, కాకి రామప్రసాద్, బయ్యరపు సూర్యనారాయణ, కట్టా శ్రీనివాస్, అనుసూరి ఏడుకొండలు, యాళ్ళ వెంకట సుబ్బారావు, బొక్కా నాగమణి తదితరులు పాల్గొన్నారు.
Back to Top