వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుని పాదయాత్ర

ఒంటిమిట్ట) వైఎస్సార్
జిల్లా లోని ఒంటిమిట్ట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి విస్తారంగా ప్రాచుర్యం
కల్సించాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్ నాథ్
రెడ్డి అభిప్రాయ పడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఈ దేవాలయంలోనే అధికారికంగా
శ్రీరామ నవమి ఉత్సవాలు చేయించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ డిమాండ్ చేస్తూ లేఖ
రాసిన సంగతి ఆయన గుర్తు చేశారు. తద్వారా ఈ గుడికి ప్రాచుర్యం కల్పించేందుకు
ప్రయత్నాలు సాగించినట్లు తెలిపారు. తమ వంతు క్రషిగా ఈ సారి శ్రీ రామ నవమి కి
పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆకేపాడు దేవాలయాల సమూహం నుంచి భక్తులతో
కలిసి పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. కొంత కాలంగా ఆయన శ్రీ రామ మాల లో ఉన్న
సంగతి తెలిసిందే. 

Back to Top