విజయవాడ కార్పొరేషన్ ఎదుట వైయస్సార్సీపీ ధర్నా

విజయవాడః అర్హులేన పేదలకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ కార్పొరేషన్ ఎదుట వైయస్సార్సీపీ ధర్నా చేపట్టింది. పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, బొప్పన భవనకుమార్ లు పాల్గొన్నారు. పేదలందరికీ ఇళ్లు ఇచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. వైయస్ హయాంలో 45 లక్షల ఇళ్లు కట్టిస్తే...బాబు మూడున్నరేళ్లలో ఒక్క ఇళ్లు కూడ కట్టించిన పాపాన పోలేదన్నారు. విజయవాడలో ఇళ్లకు శంకుస్థాపన చేసినా పనులు ప్రారంభించలేదని దుయ్యబట్టారు. 

Back to Top