జేసీ బ్రదర్స్‌కు నిరసనగా వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తల ఆందోళన

అనంతపురం: జేసీ బ్రదర్స్‌ దౌర్జన్యానికి నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు పెద్దపడుగూరులో ఆందోళన బాట పట్టారు. అప్పేచర్లలో వైయస్‌ఆర్‌ సీపీ శ్రేణుల ఆస్తులపై దాడులకు పాల్పడిన జేసీ వర్గీయులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని నిరసన చేపడుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు దాడులకు తెగబడ్డారు. తాడిపత్రి వైయస్‌ఆర్‌ సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జేసీ బ్రదర్స్‌కు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని పార్టీ నాయకులు మండిపడ్డారు. పెద్దపడుగూరులో పోలీసులకు, పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
Back to Top