ఈనెల 9న ఒంగోలులో భారీ ధర్నా

ప్రకాశంః ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఈనెల 9న వైయస్సార్సీపీ భారీ ధర్నా నిర్వహిస్తోంది. ఈ ధర్నాలో వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ పాల్గొంటారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ ధర్నా కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఇక్కడ జరిగే బహిరంగసభలో వైయస్ జగన్ ధర్నాను ఉద్దేేశించి ప్రసంగిస్తారని చెప్పారు.

Back to Top