కదిరి ఆర్‌డీఓ కార్యాలయం ముందు ధర్నా

అనంతపురంః రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన తెలుగుదేశం ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 7వ తేదీన ఉదయం 9 గంటలకు కదిరి ఆర్‌డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పివి సిద్దారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల వైయస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, మండల కన్వీనర్‌లు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.

Back to Top