సాగునీటి కోసం వైయస్‌ఆర్‌ సీపీ పోరాటం

  • సీమపై దురుద్దేశ్యంతోనే నీరు విడుదల చేయని బాబు
  • శ్రీశైలంలో నీటి 864.3 అడుగులు పెరిగింది
  • ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 854 దాటితే నీరు ఇవ్వాలి
  • కేసీకెనాల్‌, తెలుగుగంగకు నీరివ్వకపోతే పోరాటం ఉధృతం చేస్తాం
  • మైదుకూరులో సాగునీటికోసం ధర్నాలో వైయస్సార్సీపీ నేతలు
వైయస్‌ఆర్‌ జిల్లా: రాయలసీమకు నీరు ఇవ్వకూడదనే దురుద్దేశ్యంతో శ్రీశైలంలో నీటి మట్టం పెరుగుతున్నా సీఎం చంద్రబాబు నీరు విడుదల చేయడం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మండిపడ్డారు. కేసీకెనాల్‌కు నీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మైదుకూరు నాలుగు రోడ్ల జంక్షన్‌లో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అంజద్‌బాషా, రాచమల్లు శివప్రసాదరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలంలో ప్రస్తుతం 1.50 లక్షల క్యూసెక్కుల నీరుతో 864.3 అడుగుల నీటి మట్టం దాటిపోయిందన్నారు. 854 అడుగులు దాటితే నీరు విడుదల చేయాలని ప్రభుత్వ ఉత్వర్వులు ఉన్నా.. చంద్రబాబు పాటించడం లేదన్నారు. రాయలసీమకు నీరు ఇవ్వకుండా అడ్డుకునేందుకు పవర్‌ జనరేషన్‌ పేరుతో 45 వేల క్యూసెక్కల నీటిని వదులుతున్నారన్నారు. విద్యుత్‌ కొనుగోలు చేసుకోవచ్చు కానీ నీరు కొనేందుకు అవకాశం లేదని, పవర్‌ జనరేషన్‌ ఆపి రాయలసీమకు నీరు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేసీకెనాల్, బ్రహ్మంసాగర్, తెలుగుగంగా ఆయకట్టుల కింద లక్షల ఎకరాల భూములు ఉన్నాయని, నీరు లేక రైతాంగం తీవ్ర దుర్భిక్షంలో ఉందన్నారు. నీరు ఉండి కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీకెనాల్‌కు నీరు ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ఎవరూ అడ్డం వచ్చినా రాజోలు దగ్గరకు వెళ్లి నీటిని సాధించుకుంటామన్నారు. 
––––––––––––––––––––
కక్షతోనే నీటి సరఫరా నిలిపివేత
వైయస్‌ఆర్‌ జిల్లా: గత పది రోజులు శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున నీరు వస్తున్నా.. కక్షపూరితంగా రాయలసీమకు చంద్రబాబు నీరు విడుదల చేయడం లేదని ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతాంగానికి సాగునీరు సరఫరా చేయాలని గత ఐదు రోజుల క్రితం శాసనసభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్‌ను కోరడం జరిగిందని, అయినా ఫలితం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా వైయస్‌ఆర్‌ సీపీ ధర్నాకు దిగిందన్నారు. ధర్నా ధ్వారా అయినా వెంటనే కేసీకెనాల్‌కు నీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సీమలో సెప్టెంబర్‌ వచ్చినా ఇంకా వరినాట్లు వేయలేదన్నారు. గత సంవత్సరం సర్వారాయిసాగర్, వామికొండ, పైడిపాలెం, చిత్రావతికి నీరు ఇస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం కేవలం ట్రైల్‌రన్‌లు మాత్రమే నడిపారని, అది కూడా కాంట్రాక్టర్‌లకు ముడుపులు చెల్లించేందుకే చేశారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కేసీకెనాల్‌కు, తెలుగుగంగకు నీరు ఇవ్వాలన్నారు.
––––––––––––––––––––
రైతులను అప్పుల పలు చేసేందుకే దుశ్చర్య
వైయస్‌ఆర్‌ జిల్లా: రాయలసీమ రైతాంగాన్ని ముఖ్యంగా కడప జిల్లా రైతులను అప్పుల పాలు చేయడానికి ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. కడప జిల్లా శత్రుస్థానంలో ఉండే జిల్లాగా ముఖ్యమంత్రి భావిస్తున్నారన్నారు. శైలంలో 854 అడుగుల నీటి మట్టం ఉన్నప్పటికీ నీరు విడుదల చేయకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. వ్యవసాయం వల్ల ఆదాయం, ఉపయోగం లేదు అని చెప్పే ముఖ్యమంత్రి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తారనే నమ్మకం లేదని ఆరోపించారు. చంద్రబాబు రాయలసీమకు నీరు సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. 
–––––––––––––––––––––
బాబు పాలనలో ఆధ్వానంగా రైతాంగం
వైయస్‌ఆర్‌ జిల్లా: చంద్రబాబు పరిపాలనలో రాయలసీమ రైతాంగ పరిస్థితి అధ్వానంగా తయారైందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయమే దండగ అనే వ్యక్తి చంద్రబాబు అదే ఉద్దేశ్యంతో  సాగుకు నీరు ఇవ్వడం లేదన్నారు. కేసీకెనాల్‌కు నీరు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మైదుకూర్‌లో ధర్నా చేస్తున్నామన్నారు. నీరు ఇవ్వకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 
–––––––––––––––––
వ్యవసాయంపై బాబుకు చిత్తశుద్ధి లేదు
వైయస్‌ఆర్‌ జిల్లా: వ్యవసాయంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అంజద్‌బాషా ధ్వజమెత్తారు. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా నీరు వస్తున్నా.. కేసీకెనాల్‌కు నీరు విడుదల చేయడం లేదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 854 అడుగల నీటి మట్టం దాటితే నీరు విడుదల చేయాలి.. కానీ చంద్రబాబు 864.3 అడుగులు దాటినా విడుదల చేయడం లేదని మండిపడ్డారు. రాయలసీమ రైతాంగం నీరు లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తీరుకు నిరసనగా రైతాంగమంతా వచ్చి రోడ్డుపై ధర్నా చేపట్టిందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు మేలుకొని వ్యవసాయానికి నీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top