చిత్తూరు ఎన్కౌంటర్ పై న్యాయవిచారణ జరిపించాలి: వాసిరెడ్డి పద్మ

హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లర్ల పేరుతో అమాయక కూలీలను హతమార్చడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి అన్నారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎన్కౌంటర్ పై న్యాయవిచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. కూలీల వద్ద ఆయుధాలు ఏమైనా ఉన్నాయా, వారేమైనా కాల్పులు జరిపారా అని ప్రశ్నించారు.
చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ ఎన్కౌంటర్ జరిగిందన్న అనుమానం కలుగుతోందన్నారు. ప్రభుత్వ అనాలోచిత చర్యతో పోరుగు రాష్ట్రాల ముందు దోషులుగా నిలిచే పరిస్థితి తలెత్తిందని వాసిరెడ్డి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు.
Back to Top