'విజయనగరం జిల్లాలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలి'

హైదరాబాద్: వైద్య కళాశాలల ఏర్పాటులో చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని,  ప్రతిపక్ష నేత  వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. టీడీపీ పార్టీకి చెందిన అశోక్ గజపతి రాజుకి మెడికల్ కాలేజీ మంజూరు చేసి గొప్పగా చెప్పుకుంటున్నారని, చంద్రబాబు వారికిష్టం వచ్చినవారికి మెడికల్ కాలేజీకి అనుమతి ఇచ్చుకోవచ్చు...గొప్పలు చెప్పుకోవచ్చని ఆయన అన్నారు. గజపతిగారికి ఎంత మంచి పేరు ఉందో...బొబ్బిలి రాజావారికి అంతే మంచి పేరు ఉందన్నారు. ఆయన కూడా మంచి కార్యక్రమాలు చేశారని, సుజయకృష్ణా రంగారావుకు కూడా మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలన్నారు.

Back to Top