సబ్సిడీ ప్రకటించాలి: ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి

జమ్మలమడుగు: వైఎస్‌ఆర్ కడప జిల్లాలో రబీ సీజన్‌లో సాగుచేసిన శనగ, ధనియాల పంటలు అకాల వర్షాలతో పూర్తిగా తుడిచి  పెట్టుకొనిపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వారికి ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ ప్రకటించి ఆదుకోవాలని ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాల్లో 615 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఎక్కడా కూడా కనీస వర్షపాతం నమోదు కాలేదన్నారు. రబీ సీజన్‌లో అరకొర వర్షం పడి భూమి పదును కాకున్నా  రైతులు శనగ, ధనియాల పంట సాగుకోసం ముందుకు వచ్చారన్నారు. అయితే సరైన వర్షాలు నమోదు కాకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించినా ఇంత వరకు ఎంత ఇన్‌పుట్ సబ్సిడీని రైతులకు ఇస్తారో ప్రకటించకపోవడం దారుణమని పేర్కొన్నారు.
Back to Top