రైతు సమస్యలపై చర్చకు వైఎస్సార్ సీపీ డిమాండ్...

హైదరాబాద్: రాష్ట్రమంతా అన్నదాతలు అల్లాడిపోతున్నందున రైతు సమస్యలపై చర్చ చేపట్టాలని వైఎస్సార్ సీపీ అసెంబ్లీ లో డిమాండ్ చేసింది. ఈ మేరకు నిభందనల మేరకు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది. ఈ వాయిదా తీర్మానాలను స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. రైతు సమస్యలు, రైతుల ఆత్మహత్యలు,కరవు సమస్యలపై చర్చకు అనుమతి ఇవ్వాలని వైఎస్సార్ సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ దశలో సభలో కొన్ని వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. సభ్యుల్ని ఉద్దేశించి ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలకు వైఎస్సార్ సీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. సభ్యుల నినాదాలతో సభ మార్మోగింది.
Back to Top