హోరెత్తుతున్న ప్రత్యేకహోదా నినాదం..!

రాష్ట్రవ్యాప్తంగా
ఆంధ్రుల హక్కు ప్రత్యేకహోదా నినాదాలు మారుమోగతున్నాయి. రాష్ట్రానికి
ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన
కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రత్యేకహోదా వచ్చే వరకు పోరు ఆగదని పార్టీ
శ్రేణులు, ప్రజలు స్పష్టం చేస్తున్నారు. కొవ్వొత్తుల ప్రదర్శన,
ర్యాలీలు,ధర్నాలు, రిలేదీక్షలతో  హోరెత్తిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇవాళ
అన్ని నియోజకవర్గాల్లోని ఆర్టీసీ బస్సు డిపోలను వైఎస్సార్సీపీ
ముట్టడించింది.

వైఎస్సార్ జిల్లా...
ప్రత్యేకహోదా
డిమాండ్ చేస్తూ కమలాపురంలో వైఎస్సార్సీపీ రిలే దీక్షలు కొనసాగిస్తోంది. ఈ
దీక్షకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి సంఘీభావం తెలిపారు. బద్వేల్లో ఎమ్మెల్సీ
డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే జయరాములు ఆధ్వర్యంలో ఐదవ రోజు రిలే దీక్షలు
నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. రాజంపేటలో
ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీలు, కళాకారుల
ఐక్యవేదిక రిలేనిరాహార దీక్ష నిర్వహించారు. జమ్మలమడుగులో వైఎస్సార్సీపీ
రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి హన్మంత రెడ్డి ఆధ్వర్యంలో రిలేదీక్షలు
కొనసాగుతున్నాయి.

ప్రకాశం..
ప్రత్యేక
హోదా కోరుతూ గిద్దలూరులో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో
,పర్చూరులో వైఎస్సార్సీపీ నేత గొట్టిపాటి భరత్ కుమార్ ఆధ్వర్యంలో, చీరాలలో
వైఎస్సార్సీపీ నేత బాలాజీ ఆధ్వర్యంలో. పర్చూరులో గొట్టిపాటి భరత్ కుమార్
ఆధ్వర్యంలో  ఐదవ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది.

అనంతపురం..
తాడిపత్రిలో
వైఎస్సార్సీపీ నేత రమేశ్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
కొనసాగుతున్నాయి. రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో,
తాడిపత్రిలో వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా
చేపట్టగా పోలీసులు అడ్డుకొని నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు.

చిత్తూరు..
ప్రత్యేక
హోదా కోరుతూ చంద్రగిరి, తుమ్మల గుంట వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
ఆద్వర్యంలో రాస్తారోకో నిర్వహించి..చంద్రాబాబు,వెంకయ్య నాయుడు ల దిష్టి
బొమ్మల దగ్ధం చేశారు. శ్రీకాళ హస్తి డిపో వద్ద వైఎస్సార్సీపీ నేత బియ్యపు
మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
కాకినాడ ఆర్టీసీ
బస్టాండ్ వద్ద మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో
ధర్నాచేపట్టారు.  ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో
వైఎస్సార్సీపీ కార్యకర్తలు పీలేరు ఆర్టీసీ బస్ట్ డిపోను ముట్టడించారు.

విశాఖపట్నం...
ప్రత్యేక
హోదా కోసం ద్వారకా బస్టాండ్ వద్ద వైఎస్సార్సీపీ నేతలు కోలా, జాన్ వెస్లీ
ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.  వైఎస్సార్ నేతల దీక్షకు సీపీఐ నేత
రామకృష్ణ సంఘీభావం తెలిపారు. మాడుగులలో ఎమ్మెల్యే ముత్యాల నాయుడు
ఆధ్వర్యంలో, చోడవరంలో కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో ,ఇసుకతోటలో వంశీకృష్ణ
ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్
వద్ద వైఎస్సార్సీపీ నేతల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

గుంటూరు..
పొన్నూరులో
వైఎస్సార్సీపీ నేత రావి వెంకటరమణ ఆధ్వర్యంలో. తెనాలిలో అన్నా బత్తుని
శివకుమార్ ఆధ్వర్యంలో , తణుకులో వెంకటనాగేశ్వరరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు
కొనసాగుతున్నాయి.

కృష్ణా..
తిరువూరులో
ఎమ్మెల్యే రక్షణ నిధి ఆధ్వర్యంలో రిలేదీక్షలు జరుగుతున్నాయి. గుడివాడ
ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
కైకలూరులో వైఎస్సార్సీపీ నేత డీఎన్ఆర్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు.
జగ్గయ్యపేటలో సామినేని ఉదయ భాను ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట ఆందోళన
నిర్వహించారు. అవనిగడ్డ బస్టాండ్ వద్ద సింహాద్రి రమేశ్ ఆధ్వర్యంలో, పెడన
బస్టాండ్ సెంటర్ లో ఉప్పాల రాంప్రసాద్ ఆద్వర్యంలో  రిలేదీక్షలు
కొనసాగుతున్నాయి. 

పశ్చిమ గోదావరి..
ప్రత్యేక
హోదా కోరుతూ నిడదవోలులో వైఎస్ఆర్సీపీ నేత రాజీవ్ కృష్ణ ఆద్వర్యంలో ఐదవరోజు
రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. జంగారెడ్డిగూడెం లో మురళీకృష్ణ
ఆధ్వర్యంలో, నర్సాపురంలో వైఎస్సార్సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు
ఆధ్వర్యంలో, కొవ్వూరులో వనిత ఆధ్వర్యంలో బస్టాండ్ ల వద్ద నిరసన
కార్యక్రమాలు జరిగాయి.

తూర్పుగోదావరి ..
ప్రత్యేక
హోదా కోరుతూ రాజమండ్రి బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు
ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాకినాడ ఎమ్మార్వో కార్యాలయం వద్ద
వైఎస్సార్సీపీ కన్వీనర్ వేణుగోపాల కృష్ణ ఆధ్వర్యంలో ఐదవరోజు రిలే నిరాహార
దీక్షలు కొనసాగుతున్నాయి.

విజయనగరం ..
సాలూరులో ఎమ్మెల్యే రాజన్నదొర ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద కార్యకర్తలు నిరసన చేపట్టారు. 
Back to Top