విశాఖకు రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి

విశాఖపట్నంః విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నగరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అన్నీ పార్టీల నేతలు ఈసమావేశానికి హాజరయ్యారు. ఈసందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ...రైల్వే జోన్ అంశాన్ని ఉత్తరాంధ్ర సమస్యగా చూడొద్దని, రాష్ట్రానికి సంబంధించిన సమస్యగా చూడాలన్నారు. విభజన చట్టంలోని హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని బొత్స ఫైరయ్యారు. 

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు ఎమ్మెల్యే స్థానాల పెంపుపై ఉన్న ధ్యాస...ప్రజాసమస్యలు, రైల్వే జోన్ పట్ల లేకపోవడం బాధాకరమన్నారు. చంద్రబాబు ఢిల్లీ చుట్టు తిరగడం తప్ప రాష్ట్రానికి సాధించిందేమీ లేదని ఎధ్దేవా చేశారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో రాష్ట్ర హక్కుల కోసం పోరాడకపోవడం దుర్మార్గమన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన  గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 

Back to Top