వైయస్ఆర్‌సీపీ హస్తిన సమైక్య ధర్నా సక్సెస్

న్యూఢిల్లీ:

ఢిల్లీలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సమైక్య ధర్నా విజయవంతమయింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచే సమైక్యవాదులు జంతర్‌మంతర్ పరిసరాలకు ‌పెద్ద ఎత్తున చేరుకున్నారు. ‘జై జైగన్, ‌'జోహార్ వైయస్ఆర్', 'సోనియా డౌన్‌డౌన్', 'కేసీఆర్ డౌ‌న్‌డౌన్’ నినాదాలతో ధర్నా ప్రాంతం దద్దరిల్లింది. శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఉదయం 10.40కి ప్రాంగణానికి చేరుకుని ధర్నా ప్రారంభించారు. అప్పటికే అక్కడ ఎదురు చూస్తున్న జాతీయ మీడియా చానళ్ల ప్రతినిధులు శ్రీ జగన్ ఇంటర్వ్యూ కోసం ‌క్యూ కట్టారు. శ్రీ జగన్ సమైక్య ధర్నాకు జాతీయ మీడియా అత్యంత ప్రాధాన్యమిచ్చింది. సమైక్యంపై ‌తొలి నుంచీ స్పష్టతతో ఉన్నది వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే  అంటూ జాతీయ చానళ్లు వార్తా కథనాలు ప్రసారం చేశాయి. 11 గంటల సమయంలో వచ్చిన వైయస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ధర్నా పూర్తయే‌ వరకూ శ్రీ జగన్ పక్కనే కూర్చున్నారు. సాయంత్రం నాలు‌గు గంటలకు శ్రీ జగన్‌ ధర్నాను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆయన ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులన్నీ పార్లమెంటు ముట్టడికి కదలి వెళ్ళాయి.

జోషికి జగన్ నివాళి‌ :
ఢిల్లీ రాంలీలా మైదానంలో సోమవారం జరిగిన ధర్నాలో గుండెపోటుతో మృతిచెందిన ఎండీఓ జోషికి శ్రీ జగన్మోహన్‌రెడ్డి సభా వేదిక నుంచే నివాళులర్పించారు. శ్రీ జగన్‌తో  పాటు ధర్నాకు హాజరైనవారంతా సంతాపంగా నిమిషం పాటు మౌనం పాటించారు. కేంద్రం చేస్తున్న అన్యాయాలకు గుండెపోటుతో వ్యక్తులు చనిపోయే పరిస్థితి వచ్చిందంటే ఈ ఉసురు కేంద్రానికి తగులుతుందని శ్రీ జగన్ మండిపడ్డారు. అనంతరం పార్లమెంటుకు ర్యాలీగా తరలి వెళ్దామని సమైక్యవాదులకు ఇదే వేదికపై నుంచి‌ శ్రీ జగన్ పిలుపుని‌చ్చి, తాను ముందుకు కదిలారు.

వైయస్ఆర్‌సీపీ ఢిల్లీ ధర్నా‌లో ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగుల ఫోరం నేతలు
మురళీకృష్ణ, పి.వి.కష్ణయ్య, హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి,
విద్యార్థి జేఏసీ నేతలు అడారి కిశోర్, డేవిడ్, సమైక్యాంధ్ర గెజిటె‌డ్‌
అధికారుల సంఘం నేత ఎ.బి.పటేల్ శ్రీ జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించారు.
ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి, మాజీ ఎంపీలు బాలశౌరి,
ఎంవీ మైసూరారెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వరూప్, ధర్మాన ప్రసాదరావు,
శ్రీకాంత్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, గుర్నాథ్‌రెడ్డి, శోభా నాగిరెడ్డి,
సుచరిత, కృష్ణదాస్, కాపు రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, భూమన
కరుణాకర్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి,
కాటసాని రామిరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీలు
జూపూడి ప్రభాకర్‌రావు, ఆదిరెడ్డి అప్పారావు, దేశాయి తిప్పారెడ్డి, పార్టీ
నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, కొణతాల రామకృష్ణ, భూమా
నాగిరెడ్డి, లక్ష్మీపార్వతి, రెహ్మాన్, వైయస్ అవినా‌శ్‌రెడ్డి,
రవీంద్రనాథ్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, జనక్‌ప్రసాద్, పుత్తా
ప్రతాప్‌రెడ్డి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, 
నిర్మలాకుమారి, శివభరత్‌రెడ్డి తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top