విశాఖ రైల్వేజోన్ కోసం వైఎస్సార్సీపీ దీక్ష ప్రారంభం

విశాఖపట్నం) ఉత్తరాంధ్ర ప్రజల కలల పంట విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కోసం
వైఎస్సార్సీపీ తరపున పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ నిరవధిక నిరాహార దీక్ష
ప్రారంభించారు. పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు తదితరులు
హాజరయ్యారు. ప్రత్యేక రైల్వే జోన్ సాధన కోసం మొదట నుంచి ఉద్యమిస్తున్నది
వైఎస్సార్సీపీ యే నని ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేశారు. విభజన చట్టంలో
పొందుపరిచినప్పటికీ రైల్వే జోన్ ఇవ్వటం లేదని మండిపడ్డారు. వామపక్ష నేతలు ఈ
దీక్షకు సంఘీభావం తెలిపారు. 

Back to Top