వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్ నిరాహార‌దీక్ష‌


 అనంతపురం :  టీడీపీ ఎమ్మెల్యే సూరి అవినీతికి నిరసనగా  అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపాలిటీ వైయ‌స్ఆర్‌సీపీ  కౌన్సిలర్‌ నారాయణ రెడ్డి త‌హ‌శీల్దార్ కార్యాల‌యం వ‌ద్ద‌ 48 గంట‌ల నిరాహార దీక్ష చేప‌ట్టారు. టీడీపీ నేతల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోందనీ, తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని  నారాయణ రెడ్డి మండిప‌డ్డారు. టీడీపీ ఎమ్మెల్యే వ‌ర‌దాపురం సూరీ ఒత్తిడితో త‌న‌ను స‌స్పెండ్ చేశార‌ని తెలిపారు. పదికోట్ల రూపాయల తాగునీటి బిల్లులను పక్కదారి పట్టించాన‌ని త‌న‌పై నింద‌లు మోపార‌ని, ఎమ్మెల్యే వరదాపురం సూరీ ఒత్తిడితోనే తనను సస్సెండ్‌ చేశారని నారాయణరెడ్డి వివ‌రించారు. లేనిపోని ఆరోపణలతో తనపై కక్ష సాధిస్తున్నారని వాపోయారు. ఎమ్మెల్యే అక్రమాలపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు. 

Back to Top