మేయర్ పోడియం వద్ద బైఠాయింపు

తూర్పుగోదావరి జిల్లా (రాజమహేంద్రవరం) : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో టీడీపీ నేతలు అధికారమదంతో అహంకారపూరితంగా వ్యవహరించారు. నగర ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ప్రస్తావించారు. వాటిని పరిష్కరించటంలో అధికార పక్షం విఫలమైందని వారు ఆరోపించారు. వారు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక   టీడీపీ నేతలు రెచ్చిపోయి ప్రవర్తించారు. అధికారం మాది.. మీరు బయటకు పొండి అంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై మండిపడ్డారు. పచ్చతమ్ముళ్ల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైయస్సార్సీపీ సభ్యులు మేయర్ పోడియం వద్ద బైఠాయించారు. దీంతో సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది.

Back to Top