ఉపఎన్నిక బరిలో టీవైఎస్సార్సీపీ..!

హైదరాబాద్: వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది.  తెలంగాణ వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈమేరకు పోటీ చేసే విషయమై ప్రకటించారు.  హైదరాబాద్  లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో...  పార్టీ ముఖ్య నేతలతో పొంగులేటి సమావేశమయ్యారు. ఉప ఎన్నికలో పోటీకి సంబంధించి విస్తృతంగా చర్చించారు.

అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ...వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు గుణపాఠం తప్పదన్నారు. ప్రియతమ నేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే తమ అభ్యర్థిని ప్రకటిస్తామని, విజయం తమదేనని స్పష్టం చేశారు. 
Back to Top