అక్రమ అరెస్ట్ లతో ఉద్యమాన్ని ఆపలేరు

మచిలీపట్నం
: వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నానికి  బెయిల్
లభించింది. మచిలీపట్నం పోర్ట్, దాని అనుబంధ పరిశ్రమల కోసం 30 వేల ఎకరాలు
సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధం కాగా....దీన్ని వ్యతిరేకిస్తూ పేర్ని నాని
రైతుల తరుపున ధర్నాకు దిగారు. ప్రభుత్వం కుట్రపన్ని పోలీసులను ఉసిగొల్పి
నానిని మచిలీపట్నం సబ్ జైల్లో పెట్టించింది.  ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వ
దౌర్జన్యాలను ఖండిస్తూ వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

పేర్నినానిని
విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఇవాళ తహశీల్దార్
కార్యాలయం ముందు పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. వైఎస్సార్సీపీ నేతలు
బొత్స సత్యనారాయణ, పార్థసారధి, రామచంద్రారెడ్డి, జోగిరమేష్, నాగిరెడ్డి
సహా పలువురు నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. అనంతరం మచిలీపట్నం సబ్ జైలులో
పేర్నినానిని పరామర్శించారు. అక్రమ కేసులతో ఉద్యమాన్ని ఆపలేరని, రైతుల కోసం
చివరి వరకూ పోరాడతామని బొత్స స్పష్టం చేశారు. 
Back to Top