ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆందోళన

అనంతపురం : రాష్ట్రంలో తాగునీటి సమస్య తీర్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘోరంగా  విఫలమయ్యారని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు నివారణపై చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. అనంతపురంలో శంకర్నారాయణ విలేకర్లలో మాట్లాడుతూ...  మే 2వ తేదీన జిల్లాలో ఖాళీ బిందెలతో నిరసన చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.  అన్ని మండల కేంద్రాల్లో నిరసన తెలపాలని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. 

Back to Top