బాబు దుర్నీతిపై జాతీయస్థాయిలో పోరాటం

ఢిల్లీ బయలుదేరిన వైఎస్ జగన్, ఎమ్మెల్యేలు
జాతీయస్థాయిలో బాబు దుర్నీతిని ఎండగట్టనున్న నేతలు
రాష్ట్రపతి, ప్రధానిని కలవనున్న వైఎస్ జగన్
పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు

హైదరాబాద్: కోట్లాది రూపాయలు, పదవులు ఎరచూపి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న చంద్రబాబు దుర్నీతిని జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. సేవ్ డెమొక్రసీ’(ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి) అనే నినాదంతో ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బృందం ఢిల్లీకి బయలుదేరి వెళ్లింది. అవినీతి సొమ్ముతో విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రాజ్యాంగ విరుద్ధ పాలన సాగిస్తున్న చంద్రబాబుపై రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి  ఫిర్యాదు చేయనున్నారు. అదేవిధంగా వివధ  జాతీయపార్టీ  నాయకులను కలుసుకొని  బాబు కుట్ర రాజకీయాలను వైఎస్ జగన్ వివరించనున్నారు. మూడు రోజుల పాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో ఉంటారు. 

ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పరిహసిస్తూ చంద్రబాబే స్వయంగా ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు టీడీపీ కండువాను కప్పుతున్న వైనాన్ని దేశం దృష్టిని ఆకర్షించేలా తెలియజేయబోతున్నారు. చంద్రబాబు అనైతిక, అవినీతి పాలనపై వైఎస్ జగన్  ఈనెల 23న రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అదేరోజు రాత్రి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో  ‘సేవ్ డెమొక్రసీ’లో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో  కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. అన్నిచోట్లా భారీ సంఖ్యలో ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొని తమ మద్దతును ప్రకటించారు.  

ఈ నేపథ్యంలో రాష్ర్టంలో అధికార టీడీపీ సాగిస్తున్న అరాచక రాజకీయ కార్యకలాపాల గురించి జాతీయస్థాయిలో ఎండగట్టే చర్యల్లో భాగంగా వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల బృందం ఢిల్లీయాత్ర తలపెట్టింది.  వివిధ జాతీయ పార్టీల అధ్యక్షులు లేదా పార్లమెంటరీ పార్టీల నేతల్ని కలిసేందుకు అపాయింట్‌మెంట్‌లను కోరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లను కలవాలని నిర్ణయించారు. వారిచ్చే సమయాన్ని బట్టి ఈ మూడు రోజుల్లో కలసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తారు.
Back to Top