పులివెందులలో వైయస్సార్సీపీ ఫిర్యాదు

హైదరాబాద్) ఎన్నికల్లో అనేక రకాల
హామీలు ఇచ్చి, తర్వాత మోసం చేసిన చంద్రబాబు మీద రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు
నమోదు అవుతున్నాయి. చీటింగ్ కేసులు పెట్టాలన్న వైయస్సార్సీపీ పిలుపు మేరకు కంప్లయింట్
లు ఇస్తున్నారు.

వైయస్సార్ జిల్లా పులివెందులలో
వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఇందులో పాల్గొన్నారు. మాజీ మంత్రి
వైయస్ వివేకానంద రెడ్డి, ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున
ర్యాలీ తీశారు. అనంతరం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

అటు జిల్లాలో పలు చోట్ల ఫిర్యాదుల
నమోదు జరిగింది. రాజంపేటలో వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్ నాథ్
రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ర్యాలీ తీశారు. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు
చేశారు. ప్రొద్దూటూరు వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో వైయస్సార్సీపీ నాయకులు ఫిర్యాదు
చేశారు. 

Back to Top