టీడీపీ ప్రలోభాలపై ఈసీకి వైయస్సార్సీపీ ఫిర్యాదు

హైదరాబాద్ః నంద్యాల ఉపఎన్నికల్లో అధికార టీడీపీ ప్రలోభాలకు పాల్పడుతోందని, అధికార పార్టీ దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈసీకి వైయస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. దీనిపై  ఎలక్షన్ కమిషన్ ప్రధాన అధికారి భన్వర్ లాల్ స్పందించారు. అక్కడ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించారు. స్వయంగా ముఖ్యమంత్రే ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, మంత్రులు యథేశ్చగా కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని వైయస్సార్సీపీ ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసింది. 

నంద్యాల ఉపఎన్నికల్లో స్వచ్ఛందంగా ఓటర్లు ఓటేసేవిధంగా ఉండాలి గానీ...అధికారముందని, అధికారులు చేతుల్లో ఉన్నారని డబ్బులు, ప్రలోభాలతో విర్రవీగి ఇష్టమొచ్చినట్టు చేస్తే న్యాయస్థానం,  ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఊరుకోదని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్ ప్రభుత్వంపై మండిపడ్డారు. 
Back to Top