దానం నాగేందర్‌ ఆగడాలపై ఈసీకి ఫిర్యాదు

హైదరాబాద్:

ప్రజాస్వామ్య వ్యవస్థను దౌర్జన్యంతో పాతరేయాలని చూస్తున్న మాజీ మంత్రి దానం నాగేందర్, ‌ఖైరతాబాద్‌ కార్పొరేటర్ భారతిల ఆగడాలను అడ్డుకోవాలని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ ఎన్నికల కమిషనర్ భన్వ‌ర్‌లాల్‌కు విజ్ఞప్తి చేసింది. పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ సమన్వయకర్త పి.విజయారెడ్డితో పాటు నం‌దినగర్, దేవరకొండ బస్తీవాసులు లక్ష్మీ, విజయానాయక్, నవీన్ నాయక్, ఇషా‌క్‌లతో కూడిన ప్రతినిధి బృందం సోమవారంనాడు ఎన్నికల కమిషనర్‌ను కలిసి వారిద్దరిపై ఫిర్యాదు చేసింది.

శాంతియుతంగా ‘గడపగడపకూ వైయస్ఆర్‌సీపీ’ కార్యక్రమం నిర్వహిస్తున్న తమపై దానం నాగేందర్, భారతి ప్రోద్బలంతో దాడి చేసిన తీరును వారు ఈసీకి వివరించారు. వారిద్దరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వారంతా కమిషన‌ర్‌కు విజ్ఞప్తి చేశారు.

Back to Top