బాబు ఇలాకాలో బోగస్ ఓట్లు తొలగించండి

హైదరాబాద్ :

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం ఓటర్ల జాబితాలో వెలుగు చూసిన 50 వేలకు పైగా బోగస్ ఓట్లను వెంటనే తొలగించాలని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకులు భూమన కరుణాకరరెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి రాష్ట్ర ఎన్నికల ఉప ప్రధానాధికారి వెంకటేశ్వర్లును కోరారు. ఈ మేరకు వారు వెంకటేశ్వర్లును శనివారం కలిసి ఫిర్యాదు చేశారు. ఆ బోగస్ ఓట్లను తొలగించేందుకు వెళ్లే అధికారులను చంద్రబాబు ‌కుమారుడు లోకేశ్ బెద‌రిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల అధికారితో భేటీ అనంతరం కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నీతి బాహ్య చర్యలకు కుప్పం బోగస్ ఓటర్ల వ్యవహారం ‌చక్కని ఉదాహరణ అన్నారు.

కుప్పం నియోజకవర్గంలో తమిళనాడు, కర్ణాటకలకు చెందిన 50 వేల మందికి దొంగ ఓట్లు నమోదు చేయించి చంద్రబాబు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ‌ నాయకులు దుయ్యబట్టారు. గడయిర ఐదు దఫాలుగా దొంగ ఓట్లు, రిగ్గింగ్ ద్వారానే చంద్రబాబు ఎన్నికయ్యా‌రని, ఆయనపై కుప్పం ప్రజలకు ఏ మాత్రం అభిమానం లేదని బోగస్‌ ఓట్ల ఉదంతం తేటతెల్లం చేస్తోందని వారు పేర్కొన్నారు. ఈ విషయాన్ని పత్రికలు, ప్రసార సాధనాలు కూడా ప్రసారం చేశాయన్నారు.

కుప్పంలో దొంగ ఓట్లను తొలగించాలని ఎన్నికల అధికారులను కోరినట్టు భూమన, సుబ్రమణ్యంరెడ్డి చెప్పారు. బోగస్‌ ఓట్లను తొలగించేందుకు వెళ్లిన బూత్ స్థాయి అధికారులను ‌గ్రామాలలోకి రానివ్వకుండా‌ నారా లోకేశ్ బెదరిస్తున్నారని, దీనిపై కూడా స్పందించాలని విన్నవించామన్నారు. ఇకపై చంద్రబాబు దొంగాటలు సాగనివ్వబోమని, బోగస్ ఓట్లను తొలగించేంత వరకూ పోరా‌టం చేస్తామని భూమన స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోతే తమ పార్టీ ప్రత్యక్ష ఉద్యమంలోకి దిగుతుందని ఆయన తెలిపారు.

Back to Top