వైయస్సార్సీపీ కమిటీని అడ్డుకున్న పోలీసులు

విశాఖపట్నంః పాల్మన్ పేటలో బాధితులకు అండగా నిలిచేందుకు వైయస్సార్సీపీ నిజ నిర్థారణ కమిటీ బయలుదేరింది. ఐతే, తుని వద్ద నిజ నిర్థారణ కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైయస్సార్సీపీ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కమిటీ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బొత్స సత్యనారాయణ, దాడిశెట్టి రాజా, చెంగల వెంకట్రావు, గొల్ల బాబూరావు, కోలా గురువులు పోలీసులు, ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.  

ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడి త‌మ్ముడి మ‌నుషులు, టీడీపీ గుండాలు పాల్మ‌న్‌పేట గ్రామంపై దాడి చేసి మొత్తం గ్రామాన్ని లూటీ చేయ‌డంతో పాటు, మ‌హిళ‌లు, పిల్ల‌ల‌పై భౌతికంగా దాడులు చేశారు. దాడుల‌కు గురైన వారికి భ‌రోసా ఇవ్వ‌డానికి, నిజ నిర్థార‌ణకు పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ క‌మిటీని పంపించారు. జులై 1, 2 తేదీల్లో నిజ నిర్థారణ కమిటీ పాల్మన్ పేటలో పర్యటిస్తుంది. 
Back to Top