బాబు నాలుగేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం


– వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
– నాలుగేళ్ల టీడీపీ పాలనపై వైయస్‌ఆర్‌సీపీ ఛార్జ్‌షిట్‌ విడుదల
– వైయస్‌ఆర్‌సీపీ ఛార్జ్‌షిట్, టీడీపీ మ్యానిఫెస్టో దగ్గరపెట్టుకుని బాబు సరిచూసుకోవాలి
– రైతుల రుణమాఫీపైనే తొలి సంతకం అని ఊదరగొట్టారు
– చంద్రబాబు రైతాంగాన్ని చూసి సిగ్గుపడాలి
– కేవలం రూ.13 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారు
– 10 శాతం హామీలైనా నెరవేర్చావా బాబూ?

హైదరాబాద్‌: నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమని ఆయన విమర్శించారు. హామీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన చంద్రబాబు చతికిలపడ్డారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ చార్జ్‌షీట్, టీడీపీ మేనిఫెస్టోను చంద్రబాబు సరిచూసుకోవాలన్నారు. చంద్రబాబు ఇసుక, మైనింగ్, మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయాయని ఫైర్‌ అయ్యారు. శుక్రవారం వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై వైయస్‌ఆర్‌సీపీ ఛార్జ్‌షిట్‌ను వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, జంకె వెంకట్‌రెడ్డి, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. 2014 జూన్‌ 8న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఆ సమయంలో పెట్టిన మొదటి ఐదు సంతకాలకు ఇంతవరకు మోక్షం లేదన్నారు. మొదటి సంతకాలకు ఉన్న ప్రాధాన్యతను చంద్రబాబు తగ్గించారన్నారను. జూన్‌ 4వ తేదీన ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్‌లో రుణాలు మాఫీ చేయబోతున్నారని చెప్పిన చంద్రబాబు రూ.87 వేల కోట్ల రైతు రుణాలను రూ.24 వేల కోట్లకు కుదించారన్నారు. కమిటీలు వేసి మాఫీ చేయకుండా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జూన్‌ 8, 2014లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు రుణమాఫీపై చేసిన మొదటి సంతకానికి ప్రాధాన్యత లేకుండా చేశారన్నారు. బ్యాంకులో ఉన్న బంగారం ఇంటికి తెస్తామన్నారు. రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కాగానే కోటయ్య కమిటీ ఏర్పాటు చేసిన చంద్రబాబు మాఫీ చేయకుండా వెన్నుపోటు పొడిచారన్నారు. రుణాలు మాఫీ చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. రూ.24 వేల కోట్లు మాఫి చేశానని చంద్రబాబు చెబుతున్నారని, వాస్తవానికి ఈ నాటికి రైతుల ఖాతాల్లో జమా అయ్యింది కేవలం రూ.13000 కోట్లు మాత్రమే అన్నారు. టీడీపీ పాలనలో 2 లక్షల ఎకరాల్లో సాగు విస్తిర్ణం పడిపోయిందన్నారు. రూ.187 వేల కోట్లు పెట్టి రెయిన్‌గన్లు కొన్న చంద్రబాబు కనీసం 187 ఎకరాల్లోనైనా పంటలు కాపాడావా అని ప్రశ్నించారు. 

వ్యవసాయ ఉత్పత్తులకు స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల మేరకు ఒక్క పంటకైనా మద్దతు ధర ఇచ్చావా అని నిలదీశారు.  బెల్టుషాపులు మూసి వేస్తున్నానని చెప్పిన చంద్రబాబు ఒక్కటైనా మూత వేయించారా అన్నారు. జాతీయ రహదారి ప్రక్కన ఉన్న వైన్‌ షాపులు మార్చాలని సుప్రీంకోర్టు ఉత్తర్హులను ఈ ప్రభుత్వం వారి షాపులు ఉన్న చోటికి స్థానిక రోడ్లను మార్చుకొని బెల్టు షాపులు కొనసాగిస్తున్నారన్నారు. ఇవాళ రూ.7 వేల కోట్ల నుంచి మద్యంపై రూ.13 వేల కోట్లకు ప్రభుత్వ ఆదాయం పెరిగిందన్నారు. రూ.2లకే 20 లీటర్ల మంచినీరు ఇస్తామని సంతకం చేసిన చంద్రబాబు ఒక్క చోటనైనా నీరు ఇచ్చావా అన్నారు. 

రాజధాని నిర్మాణాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. బ్రహ్మండమైన గ్రాఫిక్‌ చూపించి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.  పచ్చటి మూడు పంటలు పండే పొలాలను రాజధాని కోసం బలవంతంగా తీసుకున్నారన్నారు. ఇంతవరకు ఒక్క శాశ్వత భవన నిర్మాణం కూడా అమరావతిలో నిర్మించలేదన్నారు. 13 జిల్లాలకు ఏం చేయబోతున్నానో అని అన్ని జిల్లాలకు అనేక వాగ్ధానాలు చేసిన చంద్రబాబు ఇంతవరకు ఏ ఒక్క వాగ్ధానం నెరవేరలేదన్నారు. వీటిలో పదిశాతమైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. పది శాతం చూపిస్తే..నీకు సెల్యూట్‌ కొడతామన్నారు. ఎక్కడ ఏయిర్‌పోర్టులు కట్టావని, కేంద్రం ఇస్తామన్న వాగ్ధానాలు నెరవేర్చావా అని నిలదీశారు. ఎన్నికల్లో ఇ చ్చిన  హమీలు నెరవేర్చకపోవడంతో బీజేపీ, జనసేన పార్టీలు విడిపోయాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో మాఫియాను చంద్రబాబు పెంచి పోషించారన్నారు. అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఉమ్మారెడ్డి హెచ్చరించారు. 
 
Back to Top