ఈసీకీ ఆదాయ పన్ను వివరాలు ఇచ్చాం

హైదరాబాద్:

2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వైయస్ఆర్‌సీపీ ఆదాయపు పన్ను వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ముందే సమర్పించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. 2012-13 ఆర్థిక సంవత్సరం ఆదాయపు పన్ను వివరాలను  వైయస్ఆర్‌సీపీ సమర్పించలేదని జరుగుతున్న దుష్ర్పచారాన్ని తీవ్రంగా ఖండించింది.

నిర్దేశించిన నిబంధనలు, సెక్షన్ల ప్రకారం 2012-13 ఆర్థిక సంవత్సరపు ఆదాయపు పన్ను వివరాల పత్రాలను తమ పార్టీ ఎన్నికల కమిషన్‌లోని ఐటీ విభాగానికి సమర్పించినట్లు, దానికి సంబంధించిన అక్నాలెడ్జిమెంట్ కూడా పొందామని వివరించింది. తమ పార్టీపై నిరాధారంగా జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర కార్యాలయం తీవ్రంగా ఖండించింది. వాస్తవాలను కనీసం నిర్ధారించుకోకుండా, నిజానిజాలు తెలుసుకోవడానికి సంబంధిత వ్యక్తులను గానీ, సంస్థలను గానీ సంప్రదించకుండా ఇలాంటి నిరాధారమైన వార్తలను టీవీల్లో ప్రసారం చేయడం దురుద్దేశపూరిత చర్య అని, దీనిని ఖండిస్తున్నట్లు వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం పేర్కొంది.

Back to Top