రేపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 12న ఘనంగా నిర్వహించాలని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి.సురేష్ రెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతోందని చెప్పారు.

ఈ సందర్భంగా ఈ నెల 12న ఉదయం 8 గంటలకు లోటస్ పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరిస్తారన్నారు. జిల్లాలోని అన్ని డివిజన్లు, మండలాలు, నియోజకవర్గాల్లోని కార్యకర్తలందరూ జెండా ఆవిష్కరణలో పాల్గొనాలన్నారు. అదే రోజు ఆయా ప్రాంతాల్లో జెండా ఎగురవేయాలని సూచించారు.
Back to Top